<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>147</hymn_number>
<lyrics>[C1]
   ఏమి తెచ్చి నిను దర్శింతునయా
   ఏ రీతిగా నిను పూజింతునయా
   వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా

[V1]
 వెండి బంగారములు నీవే గదా
 కొండపైని పశువులు నీ వశమే గదా
 విరిగిన మనస్సు నలిగిన హృదయం నీవు కోరిన దూపమాయ

[V2]
 ప్రథమ ఫలములు నీ సేవకీయనా
 దహన బలుల నైవేద్యమీయనా
 సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా

[V3]
 మంచి తైలముతో అభిషేకించనా
 ఎంచి కానుకలిచ్చి భజయించనా
 న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా</lyrics>
<title>ఏమి తెచ్చి నిను</title>
</song>